- Advertisement -
ఛండీగఢ్: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఐఎన్‌ఎల్‌డి అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా(89) కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1987 నుంచి 1990వరకు రాజ్య సభ సభ్యుడిగా సేవలందించారు. ప్రకాశ్ 1989 నుంచి 2005 వరకు హర్యానా ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు సేవలందించారు. 1935లో మాజీ ఉప ప్రధాని చౌధరీ దేవిలాల్‌కు ఓం ప్రకాశ్ జన్మించారు. 1999-2000 మధ్య జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్ అవకతవకలు పాల్పడడంతో ఆయన జైలు జీవితం గడిపారు. 2021లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
- Advertisement -