హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి ఏ. కె. గోయెల్ కు అంబేద్కర్ వర్శిటీ పీహెచ్.డి. పట్టాను అవార్డు చేసింది. డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెస్ పరిశోధనా సంస్థలో ఎకనామిక్స్ విభాగంలో చేసిన పరిశోధనకు గాను గోయెల్ కు పీహెచ్.డి పట్టాను విశ్వవిద్యాలయం ప్రకటించింది. సెస్ ప్రొఫెసర్స్ ప్రొ. ఎస్. గలాబ్, ప్రొ.ఇ. రేవతి ఆధ్వర్యంలో “పొలిటికల్ అండ్ ఎకనామిక్ హిస్టరీ అఫ్ తెలంగాణ – 1636 – 1853 (తెలంగాణ రాజకీయ ఆర్ధిక చరిత్ర 1636 – 1853 ) అనే అంశంపై గోయెల్ చేసిన పరిశోధనలకు పీహెచ్.డి. డిగ్రీని ప్రకటించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఢిల్లీ సమీపంలోని ఓ గ్రామంలో జన్మించిన గోయెల్ ఖరగ్ పూర్ ఐఐటీలో డిగ్రీ, కాన్పూర్ ఐఐటీలో పీజీ పూర్తి చేశారు. 1974 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ క్యాడర్ లో పలు కీలక విభాగా ల్లో పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.
– ప్రజా సంబంధాల అధికారి.