Sunday, January 19, 2025

బిజెపిలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బిజెపిలో జోరుగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్ కెఎస్ భదౌరియా, తిరుపతి మాజీ ఎంపి వరప్రసాద్ రావు వెలగపల్లిలు బిజెపిలో చేరారు. ఆదివారం ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ ల సమయంలో వీరిద్దరూ బిజెపిలో జాయిన్ అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన భదౌరియా.. భారత వైమానిక దళంలో దాదాపు 40 ఏళ్లుగా సేవలందించారు.

కాగా, ఉత్తర్ ప్రదేశ్ లోని 80 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి భదౌరియాను బిజెపి పోటీలో దింపనున్నట్లు తెలుస్తోంది. ఈసారి దేశంలో ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 19న మొదలై.. జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న కేంద్రం ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News