భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్(95) ఆనారోగ్యంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. టీమిండియా తరుపున గైక్వాడ్ 11 టెస్టు మ్యాచ్‌లలో ఆడారు. 1928, అక్టోబర్ 27న ఆయన జన్మించారు. భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ ఔన్షుమాన్ గైక్వాడ్, దత్తాజీరావు గైక్వాడ్ కుమారుడే.
కాగా, 1952, 1959లో ఇంగ్లాండ్, 1952-53లో వెస్టిండీస్‌లో పర్యటించిన భారత జట్టులో గైక్వాడ్ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత 1959 పర్యటనలో టీమిండియాకు కెప్టెన్‌గానూ ఆయన వ్యవహరించాడు. 11 టెస్టు మ్యాచ్ లలో అత్యధికంగా అతడు 52 పరుగులు చేసి ఏకైక హాఫ్ సెంచరీ అతడి ఖాతాలో ఉంది. రంజీ ట్రోఫీలో మాత్రం 14 సెంచరీలతో 3139 పరుగులు చేశాడు. 1959లో మహారాష్ట్రపై జరిగిన రంజీ మ్యాచ్‌లో 249 పరుగులు చేసి డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 25 వికెట్లు తీశాడు. దత్తా గైక్వాడ్ కుమారుడు అంశుమన్ గైక్వాడ్ కూడా టీమిండియా జట్టుకు ఓపెనర్‌గా ఆడాడు.