Monday, December 23, 2024

భార్యపై వినోద్‌కాంబ్లీ దాడి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మాజీ క్రికెటర్ వినోద్‌కాంబ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం మత్తులో కాంబ్లీ భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో సబర్బన్ బాంద్రా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం వినోద్‌కాంబ్లీ నివాసానికి వెళ్లిన ఇద్దరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాంబ్లీ స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకు హాజరుకావాల్సిందిగా కోరారు. శుక్రవారం జరిగిన దాడి ఘటనకు సంబంధించి కాంబ్లీని ఇంకా అరెస్టు చేయలేదని పోలీస్ అధికారులు తెలిపారు. కుకింగ్ పాన్ హ్యాండిల్‌ను తనపైకి విసరడంతో తలకు గాయమైందని కాంబ్లీ భార్య ఆండ్రియా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 సమయంలో మద్యంమత్తులో ఇంటికి వచ్చిన భార్య ఆండ్రియాను తిట్టాడు.

12ఏళ్ల వారి కుమారుడు ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. కాంబ్లీని ఆపేందుకు అతడు కుమారుడు ప్రయత్నించాడు. అయితే కిచెన్‌లోకి వెళ్లిన కాంబ్లీ విరిగిన ఫైయింగ్ పాన్ హ్యాండిల్‌ను భార్యపై కోపంతో విసరడంతో గాయమైందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వివరించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కాంబ్లీపై ఇండియన్ పీనల్‌కోడ్ సెక్షన్ 324 (మారాణాయుధంతో దాడి చేయడం), సెక్షన్ 504( ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం) ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా గతేడాది ఫిబ్రవరిలో బాంద్రాలోని రెసిడెన్షియల్ సొసైటీ గేటును కారుతో గుద్దేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కాంబ్లీ బెయిల్‌పై విడుదలయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News