Friday, July 5, 2024

ఆస్పత్రిలో చేరిన భారత మాజీ ప్రధాన కోచ్

- Advertisement -
- Advertisement -

టీమిండియా మాజీ ప్రధాన కోచ్ అన్షుమన్ గైక్వాడ్ (71) తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాడు. లండన్‌లోని కింగ్స్ కాలేజీ ఆసుపత్రిలో గైక్వాడ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అతని పరిస్థితి విషమయంగా ఉంది. గైక్వాడ్‌కు అనారోగ్యంతో పాటు తీవ్ర ఆర్థిక సమస్యలు నెలకొన్నాయి. క్రికెటర్‌గా, కోచ్‌గా అన్షుమన్ భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. రెండు సార్లు భారత్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.

అతని పర్యవేక్షణలో భారత్ పలు సిరీస్‌లలో, ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శనతో అలరించింది. ఇలాంటి సేవలు అందించిన క్రికెటర్ చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంటే బిసిసిఐ పెద్దలు పట్టించుకోక పోవడం నిజంగా బాధించే అంశమే. ఇప్పటికైనా బిసిసిఐ స్పందించి గైక్వాడ్‌కు ఆర్థిక సహాయం చేయాలని భారత మాజీ ఆటగాడు సందీప్ పాటిల్ విజ్ఞప్తి చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News