మన తెలంగాణ/హైదరాబాద్ : నంద్యాల జి ల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో హై డ్రామా సాగింది. టిడిపి నేత, మాజీ ఐపిఎస్ అధికారి శివానంద రెడ్డి ఇంటికి తెలంగాణ పో లీసులు వెళ్లడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఓ భూ వివాదం కేసులో శివానందరెడ్డి ఇంటికి వెళ్లిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆయన ను అరెస్ట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. దీం తో మొదట నోటీసులు ఇవ్వాలని పోలీసులను శివానందరెడ్డి కోరారు ఆ తర్వాత అరెస్ట్ వారెం ట్ చూపాలంటూ కోరారు. ఈ మేరకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ చేస్తుండగా అక్కడి నుంచి శివానంద రెడ్డి వెళ్లిపోయారు. శివానందరెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఉ మ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపిం ది. అయితే, తాను ఎక్కడికీ పారిపోలేదని నో టీసులు ఉంటే విచారణకు సహకరిస్తానని శివానందరెడ్డి అన్నారు. అయితే మాజీ పోలీస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య, కుమారుడిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
శివానందరెడ్డి కోసం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి క్షణాల్లో శివానందరెడ్డి పరారయ్యా రు. హైదరాబాద్ లో వి లువైన ప్రభుత్వ భూములను శివానందరెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. లాండ్ గ్రాబింగ్ కేసులో సిసిఎస్ పోలీసులు నంద్యాల వెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా భూమి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారు. రాజేంద్రనగర్ శివారులో వేల కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఔట్ వేశారు. ప్రభుత్వ స్థలంలో విజల్లా ఇన్ ఫ్రా పేరుతో విల్లాల అమ్మకాలు చేశారు. హైదరాబాద్ నార్సింగిలో గతంలో విలువైన పోలీస్ ల్యాండ్ సైతం శివానందరెడ్డి కాజేశారు. గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి పలు ల్యాండ్ సెటిల్ మెంట్లు చేసినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. సిసిఎస్‌లో మాజీ ఐపిఎస్ శివానందరెడ్డికి సంబంధించిన గ్రూప్‌పై కేసు నమోదైంది. విజల్లా గ్రూప్ ద్వారా బుద్వేల్ లో 29 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ప్రభుత్వ భూమికి విజల్లా గ్రూప్ శివానందరెడ్డి ఎసరు పెట్టారు. 2వేల 500 కోట్ల రూపాయల భూమిని శివానందరెడ్డి కబ్జా చేశారు.
అసైన్డ్ ల్యాండ్‌ను తన పేరు మీద రాయించుకొని విల్లాలను కట్టారు. శివానందరెడ్డితో పాటు భార్య, కుమారుడిపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. శివానందరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీపై నాలుగు కేసులు నమోదు చేశారు. నాలుగు కంపెనీల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై కేసులు పెట్టారు. బుద్వేల్‌లో 29 ఎకరాల ల్యాండ్ వ్యవహారంలో శివానందరెడ్డిపై కేసు నమోదైంది. అసైన్డ్ ల్యాండ్‌ను కొనుగోలు చేసి విల్లాలు చేసి శివానందరెడ్డి విక్రయించారు. శివానందరెడ్డితో పాటు పలువురు వ్యాపారవేత్తలపై పోలీసులు కేసులు పెట్టారు. శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిసిఎస్ పోలీసులు కర్నూలు వెళ్లగా సిసిఎస్ పోలీసుల కళ్లుగప్పి శివానందరెడ్డి పారిపోయారు. శివానందరెడ్డి కోసం పోలీసులు కర్నాటక, ఎపిలో తీవ్రంగా గాలిస్తున్నారు.