Monday, January 20, 2025

సతీసమేతంగా బిజెపిలో చేరిన మాజీ ఐపిఎస్

- Advertisement -
- Advertisement -

లక్నో: మాజీ ఐపిఎస్ అధికారి విజయ్ కుమార్, ఆయన భార్య అనుపమ సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో కాషాయ కండువా కప్పుకున్నారు. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. 2023 మే నుంచి 2024 జనవరి వరకు ఉత్తర్ ప్రదేశ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి)గా పనిచేసిన 1988 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన విజయ్ కుమార్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి తాను బిజెపిలో చేరినట్లు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనితీరుతో తాను ఆకర్షితుడనయ్యానని, సమాజ సేవ చేయాలన్న తలంపుతో పార్టీలో చేరానని ఆయన చెప్పారు. పోలీసు అధికారికి, ప్రజలకు మధ్య కొంత ఎడం ఉంటుందని, కాని రాజకీయాలలో అందరితో కలసి ఉండాల్సి ఉంటుందని విజయ్ కుమార్ అన్నారు. ప్రజలతో మమేకమవ్వడం తనకు అలవాటేనని, తనకు ఎటువంటి సమస్య ఉండదని భావిస్తున్నానని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News