Sunday, December 22, 2024

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఇస్రో మాజీ ఛైర్మన్ పద్మవిభూషణ్ గ్రహీత డాక్టర్ కె కస్తూరిరంగన్‌కు గుండెపోటు వచ్చింది. ఆయన శ్రీలంక పర్యటనలో ఉన్నప్పుడు సోమవారం ఈ సమస్య తలెత్తింది. వెంటనే ఆయనను విమానంలో బెంళగూరుకు తీసుకువచ్చి, స్థానిక హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ప్రముఖ శాస్త్రవేత్త ,

దేశంలో నూతన విద్యావిధానం (ఎన్‌ఇపి) రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ 83 సంవత్సరాల శాస్త్రవేత్త ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తమ ఆసుపత్రిలో పూర్తి స్థాయిత చికిత్స జరుగుతుందని హృదయాలయ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ దేవిషెట్టి తెలిపారు. కస్తూరి రంగన్ త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ ప్రకటన వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News