Monday, December 23, 2024

ఇవాళ బిజెపిలో చేరనున్న చంపై సోరెన్!

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం చంపై అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లడంతో జార్ఖండ్ రాజకీయాల్లో అలజడి మొదలైంది. జనవరిలో జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్, సిఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేయడంతో చంపాయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

ఇటీవల హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల అయ్యాక తిరిగి సిఎంగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో చంపై సోరెన్, బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ఆరుగురు ఎంఎల్ఏలు, వ్యక్తిగత సిబ్బందితో ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఢిల్లీ వెళ్లిన తర్వాత చంపై సోరెన్..ఎక్స్ వేదికగా తాను ముఖ్యమంత్రిగా అవమానాలను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడి బిజెపిలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News