Wednesday, January 22, 2025

మాజీ సిఎం హేమంత్ సోరెన్‌కు ఈనెల 22 వరకు జ్యుడీషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

రాంచీ : మనీల్యాండరింగ్ కేసులో నిందితుడైన మాజీ సిఎం హేమంత్ సోరెన్‌కు గురువారం స్పెషల్ పిఎంఎల్‌ఎ కోర్టు ఈనెల 22 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సోరెన్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ రిమాండ్ పూర్తి కావడంతో సోరెన్ తరఫున అడ్వకేట్ జనరల్ రాజీవ్ రంజన్ కోర్టులో బెయిల్ దరఖాస్తు దాఖలు చేశారు.

కోర్టు నుంచి హోట్వార్ లోని బిర్సా సెంట్రల్ జైలుకు సోరెన్‌ను తరలించారు. భూమి కుంభకోణంతో సంబంధం ఉన్న మనీల్యాండరింగ్ కేసులో జనవరి 31న సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 2న ఈడీ కస్టడీకి కోర్టు ఐదు రోజులు అనుమతించింది. అయితే అప్పటి నుంచి రెండుసార్లు ఏడు రోజుల పాటు పొడిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News