Saturday, November 16, 2024

కరెంట్ బిల్లు కట్టలేదని.. మాజీ న్యాయమూర్తిని ముంచిన సైబర్ నేరస్థులు

- Advertisement -
- Advertisement -

Former judge was defrauded by cyber criminals

 

హైదరాబాద్ : కరెంట్ బిల్లు అప్‌డేట్ కాలేదని చెప్పి మాజీ న్యాయమూర్తిని సైబర్ నేరస్థులు నిండాముంచారు. పోలీసుల కథనం ప్రకారం… బంజారాహిల్స్, రోడ్డు నంబర్3లోని అరోర కాలనీలో ఉంటున్న మాజీ న్యాయమూర్తి వాడ రాజగోపాల్ రెడ్డికి ఈ నెల 25వ తేదీన సైబర్ నేరస్థులు ఫోన్ చేశారు. మీరు కరెంట్ బిల్లు కట్టలేదని, గడువులోపు కట్టకుంటే కరెంట్ కట్ అవుతుందని చెప్పారు. తాను బిల్లుకట్టానని మాజీ న్యాయమూర్తి చెప్పాడు. అయితే సిస్టంలో అప్‌డేట్ కాలేదని సైబర్ నేరస్థులు చెప్పారు. బిల్లులు అన్ని దగ్గర పెట్టుకోవాలని మళ్లీ గంట తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడు. మళ్లీ ఫోన్ చేసిన నిందితులు మాజీ జడ్జి, బ్యాంక్ ఖాతా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత కొద్ది సేపటికి న్యాయమూర్తి బ్యాంక్ ఖాతా నుంచి 47,631రూపాయలు కాజేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మాజీ న్యాయమూర్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News