- Advertisement -
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ(80)కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని బెర్లిన్స్ చారిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని అయన కుమారుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. చాందీ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాప వ్యక్తం చేశారు. కాగా, 1943 అక్టోబర్ 31న కేరళలో జన్మించిన ఊమెన్ చాందీ.. మొత్తం 12 సార్లు పూతుపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011-2016 కాలంలో ఆయన కేరళ సిఎంగా పనిచేశారు.
- Advertisement -