Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్‌లో చేరిన మెదక్ జిల్లా మాజీ టిడిపి అధ్యక్షుడు ఎకె. గంగాధర్‌రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మెదక్ నియోజకవర్గ ఇంచార్జి,ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ టిడిపి అధ్యక్షుడు,మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఎకె .గంగాధర రావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. వీరితో పాటు మెదక్ నియోజకవర్గ టిడిపి కీలక నేతలు మైనంపల్లి రాధాకిషన్ రావు, రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ ఎకె రమేష్ చందర్‌లు కూడా బిఆర్‌ఎస్ లో చేరారు.

బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ సమక్షంలో వారు బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. వారికి గులాబీ కండువ కప్పి అధినేత పార్టీ లోకి ఆహ్వానించారు. మెదక్ నియోజక వర్గంలో రాజకీయ పట్టు వున్న నేత గంగాధర్ రావుకు ప్రజల్లో మంచి పేరువుంది. సీనియర్ రాజకీయ నాయకుడు చేరడంతో మెదక్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌కు మరింత బలం చేకూరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News