Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా: చంద్రశేఖర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను బిజెపి కాపాడుతోందని అన్నారు. బిజెపి విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

బండి సంజయ్‌ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించటం తప్పు అని వ్యాఖ్యానించారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటేనని గ్రామస్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణలో బిజెపిది మూడో స్థానమేనన్నారు. తెలంగాణ బిజెపికి ప్రణాళికలు లేవని, కష్టపడే నాయకులకు ఆ పార్టీలో చోటు లేదని చంద్రశేఖర్ అన్నారు. బిజెపిలో చేరిన అనేక మంది తెలంగాణ ఉద్యమ నేతలు భంగపాటుకు గురువుతున్నారని చంద్రశేఖర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News