Monday, December 23, 2024

బిజెపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్

- Advertisement -
- Advertisement -

కారాబాద్: వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ భారతీయ జనతా పార్టీకి శనివారం రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి రాజీనామా పత్రాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్‌రెడ్డికి పంపారు. 1985 నుంచి వికారాబాద్ అసెంబ్లీకి ఐదు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ చంద్రశేఖర్, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. గత కొంత కాలంగా బిజెపిలో అసంతృప్తితో ఉన్నారు. అయితే వికారాబాద్ జిల్లా బిజెపిలో గ్రూపు తగాదాలతో సతమవుతూ అందరినీ సమన్వయం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. గ్రూపు రాజకీయాలను ఒక్కతాటిపై తేలేకపోయిన ఆయన బండి సంజయ్‌ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తొలగించడంపై అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారు. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం, బిజెపి పార్టీలో బలమైన దళిత నేతగా ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లభించడం లేదని అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది.

గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. కాగా జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చంద్రశేఖర్ ఇంటికి వికారాబాద్ మాజీ మంత్రి ప్రసాద్ కుమార్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెల 18న ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కరిగే సమక్షంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే సభలో ఎస్సీ సప్లై రేషన్ ప్రకటన సందర్భంగా పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు వరుసగా ఐదుసార్లు వికారాబాద్ ఎంఎల్‌ఎగా పనిచేశారు. 2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోగా 2019లో పెద్దపల్లి నుంచి లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News