Wednesday, December 25, 2024

సొంతగూటికి చేరుకున్న మాజీ మంత్రి చిత్తరంజన్‌ దాస్

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి చిత్తరంజన్‌ దాస్ సొంతగూటికి చేరుకున్నారు. నాగర్‌ కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో చిత్తరంజన్‌ దాస్ కాంగ్రెస్‌లో చేరారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత ఎన్టీఆర్‌ను ఓడించింది ఈయనే. 1989 అసెంబ్లీ ఎన్నల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో ఎన్టీఆర్ పై పోటీ చేసి చిత్తరంజన్‌ దాస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కాగా, 2018లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఖరి పట్ల చిత్తరంజన్‌ దాస్‌ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీకి గుడ్  బై చెప్పి బిఆర్ఎస్‌లో చేరారు. గతేడాది సెప్టెంబర్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన బిజెపిలో చేరారు. ఈరోజు మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు చిత్తరంజన్ దాస్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News