Friday, April 4, 2025

బిఆర్‌ఎస్‌కు ఇంద్రకరణ్‌రెడ్డి గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి

మన తెలంగాణ / హైదరాబాద్ : మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం గాంధీ భవ న్‌లో ఎఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు డాక్టర్ వెన్నెల అశోక్, సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకులు. కూడా కాంగ్రెస్ గూటికి చే రా రు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, నాయకులు సంగిశెట్టి జగదీష్ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లోకి బిజెపి కార్పొరేటర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వనస్థలిపురం బిజెపి కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, నియోజకవర్గ నాయకులు మల్‌రెడ్డి రాంరెడ్డి, రాంమోహన్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News