Monday, January 20, 2025

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు ఎంఎల్‌సి దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుల్ల రాజేశ్ రెడ్డి, కొడంగల్ మాజీ శాసన సభ్యుడు గురునాథ్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఎంపిపి ముద్దప్ప దేశ్‌ముఖ్ కాంగ్రెస్ లో చేరారు. వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఎంపిపిలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రిటైర్డ్ అడిషనల్ ఎస్‌పి నాగరాజు లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నాయకులు మల్లు రవి, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News