Wednesday, January 22, 2025

మంత్రి కొప్పులతో మాజీ మంత్రి కనుమూరి భేటీ

- Advertisement -
- Advertisement -

Former Minister Karumuri met with minister koppula eshwar

అమరావతి: తిరుపతి పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు ఆదివారం కలిశారు. వీరిరువురి నడుమ తాజా రాజకీయాలు చర్చకు వచ్చాయి. ఒకరినొకరు పలకరింపులు జరిగాక మాటా మంతి కలిపిన కనుమూరి తెలంగాణ రాజకీయలు వాటి ప్రభావంతో పాటు తాజాగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీపై ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా విస్తరించాలన్న కోణంలో జాతీయ పార్టీ వైపు వేసిన అడుగుల గురించి వాకబు చేస్తూనే పార్టీ విధివిధానాలు ఏ విదంగా ఉండబోతున్నాయన్నది తాజా, మాజీ మంత్రుల మధ్యన జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది. కలియుగ దైవం శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కీలక నేతల కలయిక తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరిలో తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణితో పాటు కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడం హైలెట్ గా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News