Wednesday, January 22, 2025

మహిళా కమిషన్ ముందుకు మాజీ మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కెటిఆర్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా నిరసన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర ‍మహిళా కమిషన్‌, బుద్ధ భవన్‌ ఆఫీసు దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టిసి బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా మాజీ మంత్రి కెటిఆర్‌కు ఉమెన్ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది.
ఈ క్రమంలో మహిళా కమిషన్‌ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు వెళ్లిన కెటిఆర్‌ కు నిరసనసెగ తగిలింది. కెటిఆర్‌ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్‌ నేతలు కమిషన్‌ దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ఇక మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకునేందుకు వస్తున్న కెటిఆర్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. కెటిఆర్‌కు వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. మహిళలకు కెటిఆర్‌ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడే నిరసనకు దిగారు. పోలీసులు వెంటనే స్పందించి అక్కడ ఉన్న వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుద్ద భవన్ దగ్గర తోపులాట, ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురు గాయపడినట్టు సమాచారం. మరోవైపు.. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News