- Advertisement -
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్లు వేయకుండానే ఇన్ పుట్ టాక్స్ సబ్సిడీ క్రెడిట్ పొందినట్లు విచారణలో తేలడంతో శరత్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. రాత్రి పొద్దుపోయాక శరత్ ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. శరత్ ను 14 రోజులపాటు రిమాండ్ కు తరలించారని ఆదేశించారు.
శరత్ ను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జడ్జి ఇంటివద్దకు తరలివచ్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో శరత్ ను జైలుకు తరలించేవరకూ వారు అక్కడే ఉన్నారు. దేవినేని ఉమ, గద్దె రామ్మోహనరావు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, బోడె ప్రసాద్, పట్టాభిరామ్, పిల్లి మాణిక్యరావు తదితరులు పత్తిపాటి పుల్లారావుకు అండగా నిలబడ్డారు.
- Advertisement -