Tuesday, December 24, 2024

ఎపి నుంచి మాజీ మంత్రి రఘువీరా రెడ్డికే ఛాన్స్

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల నుంచి సీడబ్ల్యూసీ జనరల్ సభ్యుల జాబితాలో ఎపి నుంచి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఒక్కరికే ఛాన్స్ లభించింది. శాశ్వత ఆహ్వానితులుగా టి. సుబ్బరామిరెడ్డి, కె. రాజు, దామోదర రాజనర్సింహకు అవకాశం దక్కింది. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్ రెడ్డిలను ఎంపిక చేశారు. గతేడాది అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ స్థానంలో 47 మందితో తాత్కాలికంగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరిస్తూ ఆదివారం జాబితాను విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News