Sunday, December 22, 2024

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ(99) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో  తుదిశ్వాస విడిచారు. రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, గతంలో మాడుగుల నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టిడిపి తరుపున వరుసగా ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్‌ హయాంలో  పశుసంవర్ధక శాఖ మంత్రిగా రెడ్డి సత్యనారాయణ పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News