Wednesday, January 22, 2025

మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య బెదిరిస్తున్నారు: సుఖేష్ చంద్రశేఖర్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. మండోలి జైలులో తనకు భద్రత లేదన్నారు. జైల్లో తనకు రక్షణ లేదని, మరో జైలు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సిఎం కేజ్రీవాల్‌పై ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. లేదంటే ఆహారంలో విషం కలిపి చంపేస్తామని బెదిరిస్తున్నారని, జైలు నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలో ఉందన్నారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య తన అమ్మకు ఫోన్ చేసి బెదిరంచిందన్నారు. ఆఫ్ ప్రభుత్వ ఆధీనంలో లేని జైలుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దుబాయ్‌లో మూడు ప్లాట్టు ఉన్నాయని, హైదరాబాద్‌లో ఓ ఫార్మా కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News