Wednesday, January 22, 2025

మాజీమంత్రి శంకర్‌రావుకు జరిమానా

- Advertisement -
- Advertisement -

Former minister Shankar rao fined

 

మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి శంకర్రావుకు ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నాడు జరిమానా విధించింది. శంకర్‌రావు దాడి చేశారని కుటుంబ సభ్యులు 2015లో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు అయింది. తాజాగా ఈ కేసులో కోర్టు 6 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత శంకర్‌రావును దోషిగా తేల్చింది. తొలుత శంకర్‌రావుకు 6 నెలల జైలు శిక్ష విధించింది. అయితే కేసు విచారణ సమయంలో శంకర్‌రావు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతని ఆరోగ్య పరిస్థితిని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుని ఆయనకు విధించిన 6 నెలల జైలు శిక్షని రద్దు చేస్తూ కేవలం జరిమానా మాత్రమే విధిస్తూ ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News