Friday, December 20, 2024

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్(70) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైజాగ్‌లోని ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామంలో వట్టి వసంతకుమార్ జన్మించారు. కాంగ్రెస్ తరపున రెండు సార్లు ఎంఎల్‌ఎ గెలవడంతో పాటు ఒక సారి మంత్రిగా సేవలందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఆయన రాజకీయాలకు స్వస్థి పలికారు. ఆయన పార్థీవదేహాన్ని వైజాగ్ నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News