Sunday, December 22, 2024

మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ సుధాకర్ రావు మృతి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ వైద్యులు,మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు బుధవారం మృతి చెందారు. మూత్రపిండం సమస్యతో బాధపడుతున్న డాక్టర్ ఎన్ సుధాకరరావు, ఇటీవల యశోద ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి ఎన్.యతిరాజ రావు కుమారుడు డాక్టర్ ఎం సుధాకర్ రావు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండే సుధాకర్ రావు, జాతీయ, అంతర్జాతీయంగా వేదికలపై, తనదైన ముద్ర వేశారు. వరంగల్ జిల్లా- నియోజకవర్గం చెన్నూరు నుండి రెండుసార్లు ఎంఎల్‌ఎగా గెలుపొందారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆయన తెలంగాణ ఆరోగ్య శ్రీ చైర్మన్‌గా వ్యవహరించారు.

ప్రగాఢ సానుభూతి తెలిపిన కెసిఆర్
మాజీ శాసన సభ్యులు డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు మృతిపట్ల బిఆర్‌ఎస్ అధ్యక్షులు కెసిఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వైద్యుడుగా, ప్రజా ప్రతినిధిగా ఆయన చేసిన ప్రజా సేవను కెసిఆర్ స్మరించుకున్నారు. శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య శ్రీ ట్రస్ట్ మాజీ చైర్మన్, మాజీ ఎంఎల్‌శ్రీ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్‌రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News