Saturday, November 16, 2024

మాజీ ఎంఎల్ఎ గడ్డం రుద్రమదేవి అనారోగ్యంతో మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నల్లగొండ మాజీ ఎంఎల్ఎ గడ్డం రుద్రమదేవి అనారోగ్యంతో మృతి చెందారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చారు. రుద్రమదేవి రాజకీయ ప్రస్థానం 1983 లో మొదలయ్యింది. 20 ఏళ్లకే నల్గొండ కౌన్సిలర్ గా గెలిచారు. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్టీ రామారావు రాజీనామా అనంతరం.. ఆ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే గా విజయం సాధించిన రుద్రమదేవి. టిడిపిలో చాలాకాలం పాటు పనిచేసారు. రుద్రమదేవి మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,పలువురు రాజకీయ ప్రముఖులు. రుద్రమదేవి కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించిన ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. నల్లగొండలోని రామగిరిలో ఉన్న నివాసంలో పార్థివ దేహం ఉంచిన కుటుంబ సభ్యులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News