Tuesday, December 24, 2024

అనారోగ్యంతో మాజీ ఎంఎల్ఎ కొమిరెడ్డి రాములు మృతి

- Advertisement -
- Advertisement -

మెట్‌పల్లి ః మెట్‌పల్లి మాజీ ఎంఎల్ఎ కొమిరెడ్డి రాములు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందారు. బడుగు బలహీనవర్గాల ఆశా జ్యోతి, మాజీ ఎమ్మెల్యే, సుప్రీం కోర్టు న్యాయవాది కొమిరెడ్డి రాములు మృతి పట్ల మెట్‌పల్లి డివిజన్ నాయకులు, ప్రజలు, జర్నలిస్టులు, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మెట్‌పల్లి మాజీ శాసనసభ్యులు కొమిరెడ్డి రాములు మరణం మెట్‌పల్లి ప్రాంతానికి తీరని లోటని, శాసన సభ్యుడిగా, సుప్రీం కోర్టు న్యాయవాదిగా, ప్రాంత రాజకీయ నాయకుడిగా వారు చేసిన సేవలు ఎప్పుటికి మరిచిపోలేమని మహేందర్ రెడ్డి అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం, బాల్య వివాహాల నివారణ కోసం, మెట్‌పల్లి ప్రాంతం పల్లెల్లో అక్షరాస్యత వృద్ది కోసం, మెట్‌పల్లిని మున్సిపాలీగా అప్‌గ్రేడ్ చేయడానికి వారు చేసిన సేవలు మరువలేమని గుర్తు చేసుకున్నారు. వారు భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, వారి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు మెట్‌పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News