- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి కన్నుమూశారు.
భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. కుంజా సత్యవతి మృతి పట్ల తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.భద్రాచలం ఎమ్మెల్యే పొదెమ్ వీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సత్యవతి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కాగా, కుంజా సత్యవతి 2009లో భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది… 2009-2014 వరకు ఎమ్మెల్యే గా పనిచేశారు.
- Advertisement -