Sunday, January 19, 2025

మాజీ ఎంఎల్ఎ మాగుంట పార్వతమ్మ మృతి

- Advertisement -
- Advertisement -

ఒంగోలు మాజీ ఎంపీ దివంగత మాగుంట సుబ్బ రామిరెడ్డి సతీమణి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఎంఎల్ఎ మాగుంట పార్వతమ్మ(77) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి పార్వతమ్మ వదిన.  నాలుగు నెలల క్రితం ఆమె కుమారుడు మృతి చెందారు. అప్పటి నుంచి పార్వతమ్మ ఆరోగ్యం మరింత దెబ్బతింది. దీంతో ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు.

ఆమె ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినా కోల్కోలేకపోయారు. నిన్ననే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితోపాటు కుటుంబ సభ్యులంతా చెన్నైకు చేరుకున్నారు. వదిన పార్వతమ్మ మృతి తమ కుటుంబంలో విషాదం నింపిందని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి చెప్పారు. రేపు నెల్లూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, 1996లో కాంగ్రెస్ తరఫున ఒంగోలు ఎంపీ, 2004లో కావలి ఎంఎల్ఎగా ఆమె పోటీ చేసి గెలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News