Monday, December 23, 2024

బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలు సాధిస్తోందని ఆయన తెలిపారు. త్వరలోనే ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. బిజెపి అగ్రనేతలు, శివసేన నేతలు ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. బిజెపి, ఎంఐఎం ఒకటేనని రాహుల్ గాంధీ అంటున్నారు.

మజ్లీస్ లాంటి పార్టీతో కలిసే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మజ్లీస్ తో కలిసి కాంగ్రెస్ లాభపడిందని ఆయన తెలిపారు. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. ఐదు నెలల్లోనే కర్నాటకను కాంగ్రెస్ భ్రష్టు పట్టిందని ఆయన మండిపడ్డారు. బిజెపి అభ్యర్థుల చేతుల్లోనే కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావు ఓడిపోతారని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ సేతలు తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News