Monday, December 23, 2024

మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌కు గాయాలు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: మాజీ ఎమ్మెల్యే, గోషామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ నాయకులు ప్రేమ్‌సింగ్ రాథోడ్‌కు రోడ్డు ప్రమాదంలో గాయా లయ్యాయి. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆయనను చికిత్సల నిమిత్తం జాయ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదంలో ఆయన ఎడమ భుజానికి 4 చోట్ల ప్రాక్చర్స్ అయ్యాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి అపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు.

మ ంగళవారం మధ్యాహ్నం ప్రేమ్‌సింగ్ రాథోడ్ కారులో జియాగూడలోని తమ పెట్రోల్ పంపు వైపు వెళ్తుండగా, అకస్మాత్తుగా రాంగ్ రూట్లో వేగంగా దూసుకువచ్చిన కారు ప్రేమ్‌సింగ్ రాథోడ్ కారును ఢీ కొట్టింది. ప్రేమ్‌సింగ్ రాధోడ్ కారు నడిపిస్తున్న డ్రైవర్ సీటు బెల్టు ధరించడంతో అతను గాయా ల నుండి తప్పించుకున్నాడు, డ్రైవర్ పక్కన కూర్చుని కారులో ప్రయాణిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌కు ఎడమ భుజం వద్ద ఎముకలు 4 చోట్ల ప్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు రమేష్‌గుప్తా మంగళవారం రాత్రి జాయ్ హాస్పిటల్‌కు వెళ్లి పేమ్‌సింగ్‌రాథోడ్‌ను పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News