హైదరాబాద్: బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ షకీల్ కుమారుడు రహేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదం కేసులో రహేల్ నిందితుడిగా ఉన్న విషయం విధితమే. ప్రజాభవన్ వద్ద ప్రమాదం జరిగిన వెంటనే రహేల్ హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయాడు. రహేల్ కోసం ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే రహేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
23 డిసెంబర్ 2023న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ప్రజాభవన్ వద్ద బారీకేడ్లపైకి కారు దూసుకెళ్లడంతో అవి ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే రహేల్ అక్కడి నుంచి తప్పించుకొని తనకు బదులుగా మరో వ్యక్తి కారు నడిపినట్టు చూపించారు. సిసి కెమెరాల ఆధారంగా అసలు నిందితుడు రహేల్‌గా పోలీసులు గుర్తించారు.