Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :  కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరారు.దివంగత ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సోమవారం సాయంత్రం తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా మాణిక్ రావు ఠాక్రే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో -చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి సీతా దయాకర్ రెడ్డి , ఆమె కుమారులు కొత్త కోట సిద్ధార్థ రెడ్డి , కార్తీక్ రెడ్డి తోపాటు పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజక వర్గాల నుంచి సీతా దయాకర్ రెడ్డి నాయకులు, అనుచరులు గాంధీ భవన్‌కు భారీగా తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News