Thursday, December 19, 2024

పిఠాపురం ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తా: ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని పిఠాపురం టిడిపి ఇంచార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ స్పష్టం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే మద్దతు ఇస్తానన్న వర్మ.. అలా కాదని పవన్ ఎంపీగా పోటీ చేస్తూ వేరే వారిని నిలబెడితే, టిడిపి నుంచి తానే బరిలోకి దిగుతానని ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ చెబుతున్నారు.

టిడిపి- బిజెపి- జనసేన పొత్తులో భాగంగా జనసేనకు రెండు ఎంపీ సీట్లు కేటాయించారు. తనను కాకినాడ నుంచి ఎంపిగా బరిలో దిగుమని బిజెపి కోరితే అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో, పిఠాపురం టిడిపి ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చిన మాటకు కట్టబడి ఉంటానని ఎస్ వీఎస్ఎన్ వర్మ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News