Tuesday, April 29, 2025

మాజీ ఎమ్మెల్యే తాటి కుమార్తె మృతి పట్ల పొంగులేటి దిగ్ర్భాంతి

- Advertisement -
- Advertisement -

Former mla thati venkateswarlu daughter died

బూర్గంపాడు: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి మృతి పట్ల తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గురువారం బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. పొంగులేటి వెంట మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య , అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ గోసు మధు, మాజీ జడ్పీటీసీ అంజి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News