Monday, December 23, 2024

మాజీ ఎమ్మెల్యే బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

జనసేన పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బుల్లాబ్బాయి రెడ్డి మంగళవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గంలోని స్వగ్రామం నాగులపల్లిలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి జనసేన, కాంగ్రెస్ పార్టీలతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు భార్య రత్నం, ఒక కొడుకు ఉన్నారు.

గతంలో కాకినాడ జిల్లా సంపర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బుల్లబ్బాయి రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News