Friday, November 22, 2024

అధికారం అన్ని రోజులు మీకే ఉండదు : బూర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో లేదో.. తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని బిఆర్‌ఎన్ నేతలు భయపడుతున్నారని మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని, అధికారం అన్ని రోజులు మీకే ఉండదని గుర్తు పెట్టుకోవాలని కోరారు. ప్రజలు ఓట్లేస్తే హీరోలు.. లేదంటే జీరోలే… రాయల తెలంగాణ అని ఒక ఎపి నేత అంటున్నాడు. పరోక్షంగా ఎపిలో ఓట్లు పొందాలని బిఆర్‌ఎస్ చేస్తున్న మోసంలాగా అనిపిస్తోందన్నారు. రాత్రికి రాత్రి జీవోలు వస్తున్నాయి. భూములను కబ్జా చేస్తున్నారు.

ప్రజల సొమ్మును పంచుతూ రాజకీయ విజయ్ మాల్యాలా బిఆర్‌ఎస్ మారిందన్నారు. దేశంలోనే ఐటి రంగంలో తెలంగాణ టాప్ అని గొప్పలు చెప్పారు. అవన్నీ అబద్ధం. 4 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులతో కర్ణాటక ముందు వరుసలో ఉందన్నారు. తెలంగాణ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిందన్నారు. కేవలం లక్ష కోట్ల పైచిలుకు మాత్రమే ఎగుమతి జరుగుతోందన్నారు. ఓ వైపు రైతులు కన్నీళ్లు కారుస్తుంటే.. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ సభల పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర అధికార ప్రతినిధి- ఎన్‌వి సుభాష్ ఆరోపించారు. స్థాయి లేని బిఆర్‌ఎస్ నేతలు సైతం ప్రధాని మోడీని విమర్శిస్తుండడం చూస్తుంటే… విడ్డూరంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News