Tuesday, November 5, 2024

టిఆర్ఎస్ కు మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

boora

హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీకి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. 2009లో వైద్య వృత్తిని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్రం కోసం శాయ శక్తుల కృషి చేశానని వెల్లడించారు. 2014లో టిఆర్‌ఎస్ పార్టీ అధినేత తనకు భువనగిరి ఎంపిగా పోటీ చేసే అవకాశం కల్పించారన్నారు. తనతో పాటు కార్యకర్తలను కలుపుకొనిపోయి శాయశక్తుల మేరకు భువనగిరి ఎంపిగా గెలిచానని పేర్కొన్నారు. తన పదవి కాలంలో భువనగిరికి ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, జాతీయ రహదారులు తీసుకరావడానికి కృషి చేశానని పేర్కొన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికలలో భువనగిరి పార్లమెంటు ఎంఎల్‌ఎల గెలుపుకోసం తీవ్రంగా శ్రమించానని వివరించారు. 2019 పార్లమెంటు ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ నుంచి భువనగిరి పార్లమెంట్ ఎంపి టిక్కెట్ మళ్లీ తనకే ఇచ్చారని, స్వల్ప మెజార్టీతో ఓడిపోయానని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా మాజీ ఎంపి అయినప్పటికి తనతో ఒక్కసారిగా కూడా సంప్రదించలేదని ఆవేధన వ్యక్తం చేశారు. కెసిఆర్ అంటే తనకు అభిమానం ఉందని, అవకాశాలు ఇవ్వడంతో కృతజ్ఞతతో ఉన్నానని, కానీ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడ్డానని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. టిఆర్‌ఎస్ పార్టీ లాంటి కుటుంబ సభ్యులతో రాజకీయ బంధం దూరమైనందుకు చింతిస్తున్నానని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News