Tuesday, November 5, 2024

బిజెపికి షాక్.. మాజీ ఎంపి వివేక్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో బిజెపికి షాక్ తగిలింది. మాజీ ఎంపి, వివేక్ వెంకటస్వామి బిజెపికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బిజెపికి రాజీనామా చేసిన వివేక్ వెంకటస్వామితో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మీలాంటి వాళ్లు కాంగ్రెస్‌లోకి రావాలని ఖర్గే కోరారు. ఖర్గే ఆహ్వానం మేరకు బుధవారం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ , ఆయన కుమారుడు వంశీ కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్‌ను ఓడించడానికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని రేవంత్ రెడ్డి వివేక్ ను కోరారు. వివేక్ చేరికతో కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు.

గాంధీ కుటుంబంతో వివేక్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు. వివేక్ తిరిగి కాంగ్రెస్ లో చేరడమంటే ఆయన సొంత కుటుంబంలో చేరినట్లేనన్నారు. ఆయన్ను కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. కీలక సందర్భంలో ఆయన కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని రేవంత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే ప్రజల ఆకాంక్షకు వివేక్ చేరిక బలాన్నిస్తుందని రేవంత్ అన్నారు. వివేక్ మాట్లాడుతూ తెలంగాణా ప్రజల ఆకాంక్షలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం నేరవేర్చలేకపోయిందని చెప్పారు. తనకు టికెట్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News