Thursday, January 23, 2025

మాజీ ఎంపి జితేందర్‌ రెడ్డి డబ్బుకు అమ్ముడు పోయాడు: బిజెపి నేత రఘనందన్‌ రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ ఎంపి జితేందర్ రెడ్డి బిజెపిలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి, పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడటం చూస్తూంటే ఆయన డబ్బులకు అమ్ముడు పోయాడనే సంగతి అర్థమవుతోందని మెదక్ ఎంపి అభ్యర్థి రఘనందన్‌ రావు దుయ్యబట్టారు. ఆయన కుమారుడికి సీటు ఇస్తే పార్టీకి సిద్ధాంతం ఉన్నట్లు, ఆయనకు ఎంపీ టికెటు ఇవ్వక పోతే సిద్ధాంతం లేనట్లా? అని ప్రశ్నించారు. ఏ ఆర్థిక ప్రయోజనాలు కోసం ఆయన పార్టీ మారారో ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన బంధువులు కంపెనీ అమ్ముతున్న ఫ్లాట్స్‌పై చేవెళ్ల ఎంపీతో కలిసి ఏమీ మాట్లాడారు ఈస్టర్న్ నిర్మాణ కంపెనీ ఎవరి భూములను ఆక్రమించింది ఎంత? సర్వే నంబర్ 343, 403 లో ఏమీ జరుగుతోందని ప్రశ్నించారు.

అడ్డగోలు కంపెనీ మీద ఇడి, ఐటికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని, ఎందుకు పార్టీ మారారో ఆధారాలతో సహా త్వరలో బయటపెడుతానని పేర్కొన్నారు. నీలాంటి వారు బిజెపికి కొత్తగా సిద్ధాంతాలు నేర్పించాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత, ఆర్థిక లబ్ధి కోసం మీరు పార్టీ మారారని ఆరోపించారు. పాలమూరులో మీరు, మీ కొడుకు కోసం పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదా అని నిలదీశారు. నిర్మాణ కంపెనీల నుండి డబ్బులు వందల కోట్లు చేతులు మారాయని, కాంగ్రెస్ ఎంపి అభ్యర్థులకు ఆ డబ్బులు పంపబోతున్నారని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News