Friday, November 1, 2024

మనీలాండరింగ్ కేసులో మాజీ ఎంపి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Former MP KD Singh Arrested in Money laundering Case

కోల్‌కతా: వ్యాపారవేత్తగా మారిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ రాజ్యసభ ఎంపి కె.డి సింగ్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బుధవారం అరెస్ట్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై కె.డి సింగ్ 2014 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతకుముందు, సింగ్ జార్ఖండ్ ముక్తి మోర్చాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అతను ఒక పెద్ద చిట్ ఫండ్ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆల్కెమిస్ట్ గ్రూపుకు నాయకత్వం వహించాడు. మనీలాండరింగ్ కేసుల్లో సింగ్‌పై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఢిల్లీలో విచారణకు పిలిచి తరువాత  అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సింగ్ ను ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. అతనిపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ, జార్ఖండ్ ఇతర రాష్ట్రాలలో ఇడి దర్యాప్తు జరుగుతోంది.

Former MP KD Singh Arrested in Money laundering Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News