Friday, December 27, 2024

మాజీ ఎంపి, బిజెపి నేత రమేష్ రాథోడ్ మృతి

- Advertisement -
- Advertisement -

మాజీ ఎంపి, బిజెపి నేత రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని తన నివాసంలో శుక్రవారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావ తో చికిత్స కోసం కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆయన పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఆయన మృతదేహాన్ని సొంత గ్రామం ఉట్నూరుకు తరలిస్తున్నారు. రమేశ్ రాథోడ్ మృతి పట్ల అభిమానులు, రాజకీయనాయకులు సంతాపం తెలుపుతున్నారు.

కాగా, ఉమ్మడి ఏపీలో నర్నూర్ జడ్పీటీసీగా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా, అదిలాబాద్ ఎంపీగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News