అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపి సబ్బం హరి కన్నుమూశారు. కరోనాతో విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బం హరి సోమవారం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా వైరస్ సోకింది. మూడ్రోజుల హోమ్ క్వారంటైన్ తర్వాత డాక్టర్ల సలహా మేరకు విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ తో పాటు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆయన జూన్ 1, 1952 లో జన్మించారు. సబ్బం హరి వయసు 69 ఏళ్లు. ఆయన స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. సబ్బం హరి 1995లో విశాఖ మేయర్ గా ఎన్నికయ్యారు. 2009లో అనకాపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సబ్బం హరికి కుమారుడు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.