ముంబై : మాజీ మిస్టర్ ఇండియా విజేత మనోజ్ పాటిల్ బుధవారం రాత్రి 12,30 1 గంట ప్రాంతంలో తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. సబర్బన్ ఒషివారా లోని సాయిలీలా భవనంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి క్లిష్టంగా ఉందని ఆయన మేనేజర్ పారి నాజ్ చెప్పారు. స్వయం కృషితో ఉత్తమ క్రీడాకారునిగా ఎదిగిన పాటిల్ (29) కొద్ది రోజుల క్రితం తనపై బాలీవుడ్ నటుడు ఒకరు సోషల్మీడియాలో దుష్ప్రచారం సాగిస్తున్నారని, ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖను ఒషివారా పోలీస్ అధికారికి అందచేశారని మేనేజర్ చెప్పారు. అయితే ఇంతవరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదని అధికారి తెలిపారు. పాటిల్ ఉన్న కూపర్ ఆస్పత్రికి తమ అధికారి వెళ్లారని చెప్పారు. 1992 లో జన్మించిన పాటిల్ శారీరక దారుఢ్యం పోటీల్లో మిస్టర్ ఇండియాగా 2016 లో ఛాంపియన్షిప్ సాధించారు.