Wednesday, January 22, 2025

పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మాజీ నక్సల్ హత్య

- Advertisement -
- Advertisement -

గడ్చిరోలి: పోలీసు ఇన్ఫార్మర్ అని ఆరోపిస్తూ లొంగిపోయిన ఒక నక్సలైట్‌ను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సలైట్లు చంపివేసినట్లు పోలీసు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. అరేవాడ-హిద్దూర్ రోడ్డులోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో గురువారం రాత్రి జట్టుగా వచ్చిన నక్సలైట్లు జగ్గూ అలియాస్ జైరాం గావ్డేను చంపివేశారని ఆ అధికారి తెలిపారు. జిల్లాలోని భామ్రాగడ్‌లోని ఆరేవాడలో నివసిస్తున్న గావ్డే తన భౠర్య రాసో అలియాస్ దేవే పుంగటితో కలసి 2017లో పోలీసులకు లొంగిపోయాడు.

ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ వారు బతుకుతున్నారని జిల్లా ఎస్‌పి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2007 నుంచి గావ్డే, అతని భార్య నిషిద్ధ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు)కు చెందిన భమ్రాగడ్ దళంలో సభ్యులుగా పనిచేసినట్లు ప్రకటనలో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News