Saturday, April 26, 2025

మనీలాండరింగ్ కేసు… ఒడిశా మాజీ ఎమ్‌ఎల్‌ఎ రూ. 133 కోట్ల ఆస్తులు సీజ్

- Advertisement -
- Advertisement -

Former Odisha MLA assets seized

భువనేశ్వర్ : అక్రమ మైనింగ్‌తో ముడిపడి ఉన్న అవినీతి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒడిశాకు చెందిన మాజీ ఎమ్‌ఎల్‌ఎ జితేంద్రనాధ్ పట్నాయక్‌కు చెందిన రూ. 133 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం తెలిపింది. దీంతోపాటు మరో 70 లక్షల నగదును కూడా సీజ్ చేసినట్టు ప్రకటించింది. కోయింజర్ జిల్లా జోడాలో ఉన్న పట్నాయక్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో ఆస్తుల్ని గుర్తించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఒడిశా విజిలెన్స్ సెల్ చేసిన ఫిర్యాదు ఆదారంగా మైనింగ్ కుంభకోణం వెలుగు లోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News