Thursday, January 23, 2025

పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: కార్గిల్ చొరబాటుకు ప్రదాన కారకుడు, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేష్ ముషారఫ్ కన్నుమూశాడు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1999లో సవాజ్ షరీఫ్ సర్కార్ పై ఆర్మీ చీఫ్ గా ఉన్న ముషారఫ్ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా కొనసాగాడు. సవాజ్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ముషారఫ్ దుబాయ్ పారిపోయాడు. 2016 నుంచి ముషారఫ్ దుబాయిలోనే ఆశ్రయం పొందుతున్నాడు. ఈ క్రమంలో గత కొంతకాలంగా అనారోగ్యం బారిన పడిన ముషారఫ్ అస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News